సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ రాబోతుంది. కాగా ఈ చిత్రంలో చాల భాగం యుఎస్ బ్యాక్ డ్రాప్ లో సాగాల్సి ఉందట. దాంతో కచ్చితంగా ఈ చిత్రంలో ఎక్కువ భాగం అమెరికాలో షూట్ జరగాల్సి ఉందట. కానీ, కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అమెరికాలో షూట్ చేయడం కష్టం. దాంతో స్క్రిప్ట్ నే మారుస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ లో చాల మార్పులు చేశారట.
ఇక మహేష్ బాబుకు జోడీగా కీర్తి సురేష్ ఖాయం అయినట్టు ఫిల్మ్ నగర్ టాక్. ఇంతవరకు మహేష పక్కన నటించని హీరోయిన్ అయితే బాగుంటుందని భావించిన దర్శక నిర్మాతలు కీర్తిని చూజ్ చేసుకుని, ఆమెతో సంప్రదింపులు జరిపారని, కీర్తి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. మరి ఈ వార్తల్లో నిజం ఎంతనేది అధికారిక ప్రకటన వెలువడ్డాకే తెలుస్తుంది.
ఇక ఈ సినిమాలో విలన్ గా కన్నడ హీరో ఉపేంద్ర అయితే బాగుంటుందని చిత్రబృందం భావిస్తోంది. ఉపేంద్ర సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నెగెటివ్ షేడ్స్ పాత్ర పోషించినా అది విలన్ పాత్ర అయితే కాదు. మరి కన్నడ నాట స్టార్ హీరోగా కొనసాగుతున్న ఉపేంద్ర, మహేష్ సినిమాలో విలన్ గా చేయడానికి అంగీకరిస్తాడా లేదా అనేది చూడాలి. మహేష్ – పరుశురామ్ కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో కూడా మంచి ఆసక్తి ఏర్పడింది.