సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ రాబోతుంది. అయితే ఈ లాక్ డౌన్ సమయంలో, మహేష్ పూర్తిగా తన కుటుంబ సభ్యులుతో మరియు తన పెంపుడు కుక్కలతోనే గడుపుతున్నాడు. నిన్న రాత్రి మహేష్ తన ఇన్స్టాగ్రామ్లో తన పెంపుడు కుక్కలతో ఆడుకుంటున్న ఓ వీడియోను పోస్ట్ చేశాడు. అయితే ఆ వీడియోలో మహేష్ కొత్త స్టైలిష్ లుక్ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. మహేష్ కొత్త హెయిర్ స్టైల్ తో చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు. పరుశురామ్ డైరెక్షన్ లో చేస్తోన్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కోసం మహేష్ ఈ కొత్త హెయిర్ స్టైల్ తో సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో విలన్ గా కన్నడ హీరో ఉపేంద్ర అయితే బాగుంటుందని చిత్రబృందం భావిస్తోంది. ఉపేంద్ర సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నెగెటివ్ షేడ్స్ పాత్ర పోషించాడు. అలాగే మహేష్ బాబుకు జోడీగా కీర్తి సురేష్ ఖాయం అయినట్టు ఫిల్మ్ నగర్ టాక్. ఇంతవరకు మహేష పక్కన నటించని హీరోయిన్ అయితే బాగుంటుందని భావించిన దర్శక నిర్మాతలు కీర్తిని చూజ్ చేసుకుని, ఆమెతో సంప్రదింపులు జరిపారని, కీర్తి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. మరి ఈ వార్తల్లో నిజం ఎంతనేది అధికారిక ప్రకటన వెలువడ్డాకే తెలుస్తుంది.
https://www.instagram.com/p/CAAuqcinha2/