మహేష్ ఫ్యాన్స్ కి ఇది గుడ్ న్యూసే..!

మహేష్ ఫ్యాన్స్ కి ఇది గుడ్ న్యూసే..!

Published on Apr 27, 2020 3:24 PM IST

మహేష్ ఫ్యాన్స్ ప్రస్తుతం ఆయన కొత్త సినిమా అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. గీత గోవిందం దర్శకుడు పరుశురాం తో ఆయన నెక్స్ట్ మూవీ కన్ఫర్మ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. మరో ప్రక్క దర్శకధీరుడు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ తరువాత ఆయన మహేష్ తో మూవీ చేస్తున్నట్లు స్పష్టత ఇచ్చాడు. 2021 చివర్లో లేదా 2022 ప్రారంభంలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక రాజమౌళి తో మూవీ అంటే అది భారీ చిత్రం అని అనుకోవడమే.

అలాగే ఈ మూవీ దాదాపు రెండేళ్లకు పైనే షూటింగ్ జరుపుకొనే అవకాశం ఉంటుంది. అంటే రాజమౌళితో మూవీ మొదలుపెట్టాక కనీసం రెండేళ్ల వరకు వేరే సినిమా చేసే అవకాశం ఉండదు. కావున ఈలోపే మహేష్ రెండు సినిమాలు పూర్తి చేయాలని అనుకుంటున్నారట. పరుశురాం మూవీతో పాటు మరో చిత్రంలో ఆయన నటించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. రాజమౌళి సినిమా టైం లో ఏర్పడే గ్యాప్ ని ఈ విధంగా పూరించాలని ఆయన అనుకుంటున్నారట. మరి ఒక విధంగా ఇది ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు