సూపర్ స్టార్ మహేష్ బాబు పర్ఫెక్ట్ యాక్టర్ తో పాటు పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ అని కూడా అనిపించుకుంటున్నాడు. ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్ తో థియేటర్స్ బిజినెస్ తో పాటు ఎంబీ ప్రొడక్షన్స్ అనే పేరుతో మూవీ ప్రొడక్షన్ కూడా చేస్తున్నాడు. తన సినిమాలనే కాకుండా బయట హీరోలతో కూడా సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్నాడు మహేష్.
ఇప్పటికే అడవి శేష్ హీరోగా వస్తోన్న ‘మేజర్’ సినిమాని సోనీ పిక్చర్స్ మరియు ఎప్లస్ఎస్ మూవీస్ వారితో కలిసి మహేష్ బాబు నిర్మిస్తున్నాడు. ముంబై టెర్రర్ అటాక్ లో వీరమరణం పొందిన ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా చాలా భాగం షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.
కాగా తాజాగా మహేష్ బాబు, సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో కూడా మరో సినిమాని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ ఇప్పటికే మహేష్ బాబు తన ఫేవరేట్ హీరో అని చెప్పిన సంగతి తెలిసిందే. మరి నిజంగానే మహేష్, విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నాడా..!