‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ఫుల్ జోష్ మీదున్న సూపర్ స్టార్ మహేష్ బాబు అదే జోష్ తో విభిన్న లవ్ స్టొరీలు తీసే సుకుమార్ తో చేస్తున్న సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నాడు. ఇటీవలే గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ ఈ రోజు నుంచి హైదరాబాద్లో మొదలైంది, కానీ మహేష్ బాబు మాత్రం 23వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటారు.
ఈ సినిమాలో మహేష్ బాబు రాక్ స్టార్ గా కనిపించనున్నాడని ఇది వరకే తెలిపాము. మోడల్ కృతి సనన్ హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ సినిమాని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మొదటిసారి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ మహేష్ బాబు సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.