మహేష్ – సుకుమార్ సినిమా కొత్త షెడ్యుల్ వివరాలు

మహేష్ – సుకుమార్ సినిమా కొత్త షెడ్యుల్ వివరాలు

Published on May 9, 2012 9:06 AM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం ఇటీవలే అన్నపూర్ణ స్టుడియోలో ప్రత్యేకంగా వేసిన సెట్లో హీరో ఇంట్రడక్షన్ మరియు కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ చిత్రానికి సంభందించిన కొత్త షెడ్యుల్ ఈ నెలాఖరు నుండి ప్రారంభం కానుంది. మహేష్ బాబు ఈ షెడ్యుల్లో పాల్గొంటాడు. మహేష్ బాబు సరసన కాజల్ అగర్వాల్ మరోసారి నటిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు కొత్త లుక్ తో రాబోతున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు