స్పెషల్ డే నాడు మహేష్ స్పెషల్ ట్వీట్.!

మనం ఎంత ఎత్తు ఎదిగినా ఎవరో ఒకరు వాళ్ళ కానీ పరిస్థితుల వల్ల కానీ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాము. దైవ సమానులు అయిన తల్లిదండ్రుల తర్వాత ఓ మనిషి జీవితంలో అంతటి స్థానాన్ని ఒక్క గురువుకే ఎవరైనా ఇస్తారు. అలాంటి గురు పూజోత్సవ దినోత్సవం సందర్భంగా ఈరోజు సెప్టెంబర్ 5న ఒకసారి తమ గురువులకు ధన్యవాదాలు చెప్పుకుంటారు.

అలా మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒక స్పెషల్ ట్వీట్ ను తన ట్విట్టర్ ఖాతా ద్వారా పెట్టారు. నేర్చుకోడానికి ఎలాంటి హద్దులు ఉండవని. అలాగే ఈ కరోనా కష్ట కాలంలో తమ విద్యార్థుల ప్రగతి కోసం అనేక మంది గురువులు ఎంతలా కష్టపడ్డారో అందరికీ తెలుసనీ, అలాగే నేను కూడా ఎన్నో నేర్చుకోవడానికి ఇన్స్పైర్ అవ్వడానికి మార్గదర్శకంగా నిలవడానికి తోడ్పడిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞ్యతలు తెలుపుకుంటున్నాని, అందరికీ హ్యాపీ టీచర్స్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం మహేష్ దర్శకుడు పరశురామ్ తో “సర్కారు వారి పాట” అనే మాస్ ఫ్లిక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version