‘ఆగడు’ కోసం మహేష్ బాబు పాట పాడనున్నాడా?

Mahesh-Babu-Aagadu

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా ‘ఆగడు’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ సినిమాలో మహేష్ బాబుకి తండ్రిగా రాజేంద్ర ప్రసాద్ నటిస్తున్నాడని ఇదివరకే తెలియజేశాం. ‘ఆగడు’ థమన్ మ్యూజిక్ అందిస్తున్న 50వ సినిమా కావడంతో ఈ ఆల్బమ్ స్పెషల్ గా ఉండాలని మహేష్ బాబుతో పాట పాడించాలని మహేష్ బాబుని అడిగితే మహేష్ బాబు కూడా సముఖత తెలిపినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే మహేష్ బాబు పాడే పుల్ పాటని ఆగడు ఆల్బమ్ లో వినొచ్చు.

శ్రీను వైట్ల కూడా మహేష్ బాబు పాత విషయంలో ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. గతంలో ‘బిజినెస్ మేన్’ సినిమా కోసం మహేష్ బాబు ఒక పాట పూర్తిగా పాడకపోయినా కొద్దిసేపు ఓ పాటలో తన గాత్రాన్ని వినిపించాడు. మొదటి సారి మహేష్ బాబు సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్నారు.

రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. మే 31న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని లాంచ్ చేయనున్నారు.

Exit mobile version