మహేష్ ఫ్యాన్స్ కి నిరాశే మిగిల్చేలా ఉన్నాడు..?

మహేష్ ఫ్యాన్స్ కి నిరాశే మిగిల్చేలా ఉన్నాడు..?

Published on Mar 18, 2020 3:00 AM IST

సరిలేరు నీకెవ్వరు తో సంక్రాంతి బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ మరో చిత్రాన్ని ప్రకటించలేదు. ముందుగా అనుకున్న దర్శకుడు వంశీ పైడిపల్లి చిత్రం హోల్డ్ లో పడడంతో ఆయన తదుపరి చిత్రం ఏ దర్శకుడితో చేస్తాడు అనే విషయంపై స్పష్టత రాలేదు. మహేష్ హిట్ లిస్ట్ లో కొందరు యంగ్ డైరెక్టర్స్ పేర్లు వినిపిస్తున్నాయి. ఏదిఏమైనా మహేష్ నుండి 2020లో సినిమా వచ్చే సూచనలు కనిపించడం లేదు.

మహేష్ ఇప్పటికిప్పుడు ఓ డైరెక్టర్ ని ఎంపిక చేసినా ఆ మూవీ సెట్స్ పైకి వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది. మహేష్ లాంటి హీరోతో ఆరు ఏడు నెలల్లో మూవీ పూర్తి చేయడం అంటే అయ్యే పని కాదు. కాబట్టి 2020లో మహేష్ ఫ్యాన్స్ ఆయన్ని సిల్వర్ స్క్రీన్ పై మిస్సవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.

తాజా వార్తలు