ఒక ట్రూ లెజెండ్ ని కోల్పోయాం- మహేష్

దేశవ్యాప్తంగా రిషి కపూర్ మరణంపై విచారం వ్యక్తం అవుతుండగా హీరో మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా తన సంతాపం వ్యక్తం చేశారు. మరొక ట్రూ లెజెండ్ ని వరల్డ్ ఆఫ్ సినిమా కోల్పోయింది అన్నారు. సాటిలేని నటనతో ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచిన ట్రూ ఎంటర్టైనర్ రిషి కపూర్ అని కొనియాడారు. ఆయన అకాల మరణం కలచి వేసింది అన్న మహేష్ బాబు రన్బీర్ కపూర్ కి మరియు కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి మనో ధైర్యం దేవుడు ప్రసాదించాలని ప్రార్ధించారు.

రిషి కపూర్ కొన్నాళ్లుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. 2018లో బోన్ మారో క్యాన్సర్ కి గురైనట్లు తెలుసుకున్న రిషి కపూర్ న్యూ యార్క్ లో ఏడాది పాటు చికిత్స తీసుకున్నారు. దాదాపు ఒక ఏడాది చికిత్స తీసుకున్న రిషి కపూర్ గత ఏడాది సెప్టెంబర్ లో ఇండియాకి తిరిగివచ్చారు.

Exit mobile version