మహేష్ బ్లాక్ బస్టర్ మూవీకి 100డేస్..!

మహేష్ బ్లాక్ బస్టర్ మూవీకి 100డేస్..!

Published on Apr 19, 2020 12:01 PM IST

ఈ ఏడాది ప్రారంభంలోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు హీరో మహేష్. సంక్రాంతి కానుకగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు మూవీ మహేష్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ సాధించడంతో పాటు, టాలీవుడ్ హైయెస్ట్ గ్రాస్ సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ మూవీతో విజయ శాంతి రీ ఎంట్రీ ఇవ్వడం విశేషం. కాగా ఈ చిత్రం నేడు 100 డేస్ పూర్తి చేసుకుంది. జనవరి 11న విడుదలైన సరిలేరు నీకెవ్వరు నేటికి విడుదలై 100 రోజులు. నిర్మాత అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించగా దిల్ రాజు, మహేష్ నిర్మాణ భాగస్వాములుగా ఉన్నారు. రష్మిక మందాన హీరోయిన్ గా నటించింది.

ఇక మహేష్ నెక్స్ట్ మూవీ ప్రకటించాల్సివుంది. ఆయన దర్శకుడు పరుశురాం తో మూవీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అన్నింటికీ మించి రాజమౌళి తన నెక్స్ట్ మహేష్ మహేష్ తో అని ప్రకటించడం విశేషం. మహేష్-రాజమౌళి కాంబినేషన్ లో రానున్న ఈ భారీ చిత్రం 2022లో మొదలుకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు