బాలీవుడ్ సినిమాకి మహేష్ బాబు ఫిదా !

బాలీవుడ్ సినిమాకి మహేష్ బాబు ఫిదా !

Published on Jun 23, 2025 2:57 PM IST

అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘సితారే జమీన్‌ పర్‌’. ఇప్పటికే నెట్టింట ప్రశంసలు అందుకున్న ఈ సినిమాకు తాజాగా సూపర్ స్టార్ మహేశ్‌ బాబు కూడా ఇంప్రెస్ అయ్యారు. ఎక్స్‌ వేదికగా ఈ సినిమా పై మహేష్ బాబు పోస్ట్‌ పెడుతూ.. ‘ఇది అద్భుతమైన సినిమా. అమీర్ ఖాన్‌ ఇతర క్లాసిక్‌ సినిమాల్లాగానే ‘సితారే జమీన్‌ పర్‌’ కూడా మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, చప్పట్లు కొట్టేలా చేస్తుంది’ అంటూ మహేష్ బాబు పోస్ట్ పెట్టారు.

తన పోస్ట్ లో మహేష్ ఇంకా ఈ సినిమా గురించి చెబుతూ.. ‘‘సితారే జమీన్‌ పర్‌’ చూశాక కచ్చితంగా చిరునవ్వుతో బయటకు వస్తారు’ అంటూ మహేష్ బాబు చిత్రబృందాన్ని తనదైన శైలిలో అభినందించారు. అన్నట్టు ఈనెల 20న ప్రేక్షకుల ముందుకువచ్చిన ‘సితారే జమీన్ పర్‌’ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరి మనసులను దోచుకుంటోంది. ఇప్పటికే, క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌, షారుక్‌ఖాన్‌ ఈ సినిమా పై ప్రశంసలు కురిపించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు