మహేష్ లేటెస్ట్ లుక్..టీనేజ్ కుర్రాడిలా…!


టాలీవుడ్ ఎవర్ గ్రీన్ హ్యాండ్ సమ్ హీరో మహేష్. ఆయన చార్మింగ్ లుక్, మెస్మరైజింగ్ స్మైల్ అమ్మాయిల కలల రాకుమారుడిగా చేసింది. ప్రస్తుతం మహేష్ 40 ప్లస్ లోకి వెళ్లిపోయారు. ఐనప్పటికీ ఇంకా యంగ్ అండ్ లవర్ బాయ్ రోల్స్ కి ఆయన గెటప్ సెట్ అయ్యేలా ఉంది. ఇక లాక్ డౌన్ పీరియడ్ లో ఇంటిలోనే గడుపుతున్న మహేష్ లుక్ చాలా యంగ్ గా ఉంది. ఆయన నీట్ షేవింగ్ లో తన పెట్ డాగ్స్ తో ఆడుకుంటూ ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకోగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

మహేష్ లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు సంక్రాంతికి విడుదలై భారీ హిట్ అందుకుంది. ఈ మూవీ విడుదలై నాలుగు నెలలు అవుతున్నా మహేష్ తన నెక్స్ట్ మూవీ గురించి ప్రకటన చేయలేదు. ఇక పరుశురామ్ తో ఆయన మూవీ దాదాపు కన్ఫర్మ్ కాగా ఈనెల 31న అధికారిక ప్రకటన రానుంది. అలాగే మరో కొత్త చిత్రం లేదా, రాజమౌళి సినిమా గురించి ప్రకటన కూడా రావొచ్చని సమాచారం అందుతుంది. మహేష్ నుండి బిగ్ సర్ప్రైజ్ అయితే ఖాయం అట.

Exit mobile version