గౌతమ్ తో మహేష్ ఆసక్తికరమైన గేమ్ !

ఈ లాక్ డౌన్ సమయంలో గత కొన్ని వారాల నుండి నమ్రతా మహేష్ తమ పిల్లల సరదా వీడియోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. సితార అల్లరి వీడియోలతో పాటు గౌతమ్ గేమ్స్ కి సంబంధించిన వీడియోలను కూడా ఫ్యాన్స్ కు పరిచయం చేస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు తన ముద్దుల తనయుడు గౌతమ్ తో కలిసి ఆడిన గేమ్ కి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది నమ్రత. ఈ వీడియోలో మహేష్ – గౌతమ్ మధ్య గేమ్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.

ముఖ్యంగా మహేష్, గౌతమ్ నవ్వును చూసి నవ్వును ఆపుకోలేకపోవడం మంచి అనుభూతిని ఇచ్చింది. ఇక ఈ వీడియోతో పాటు నమ్రత మెసేజ్ పోస్టు చేస్తూ… ‘ ఈ గేమ్ వారికి కొత్తగా ఉంది. ఎవరైతే బ్లింక్ అవుతారో వారు ఓడిపోయినట్లు.. పోటీలో మీరు చూసినట్లుగా గౌతమ్ తన నవ్వును ఆపుకోలేకపోయాడు, తన కళ్ళను తెరిచి ఉంచలేకపోయాడు’ అని పోస్ట్ చేశారు. ఈ లాక్ డౌన్ సమయంలో, మహేష్ పూర్తిగా తన కుటుంబ సభ్యులుతోనే గడుపుతున్నాడు.

Exit mobile version