బాలనటుడిగానే స్టార్ హీరో రేంజ్ లో సాహసాలు చేశాడు మహేష్. సాంగ్స్, ఫైట్స్ వంటివి చిన్న వయసులోనే సినిమాలలో ఇరగదీశాడు. ఇక 1999లో వచ్చిన రాజకుమారుడు మూవీతో మహేష్ పూర్తి స్థాయి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ సూపర్ హిట్ అందుకుంది. ముఖ్యంగా మణిశర్మ సాంగ్స్ మూవీ విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఆ తరువాత వచ్చిన యువరాజు, వంశీ యావరేజ్ గా నిలిచాయి. కృష్ణం వంశీ తెరకెక్కించిన మురారి మూవీ మహేష్ కి అమ్మాయిలలో మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర చేసింది.
కానీ మహేష్ ని మాస్ ఆడియన్స్ కి దగ్గర చేసిన చిత్రం మాత్రం ఒక్కడు. గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ 7వ సినిమాగా వచ్చిన ఒక్కడు ఇండస్ట్రీ హిట్ కొట్టింది. మహేష్ యాక్షన్ మరియు మేనరిజం ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. భూమిక లవ్ ట్రాక్ కూడా అద్భుతంగా కుదిరింది. మణిశర్మ సాంగ్స్ తెలుగు ప్రేక్షకులను ఓ ఊపు ఊపాయి. మొత్తంగా భారీ విజయాన్ని అందుకున్న ఒకడు మూవీ మహేష్ కి nభారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది.