సూపర్ స్టార్ మహేష్ బహుముఖ ప్రజ్ఞాశాలి నటి విజయ నిర్మల గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. నిన్న విజయ నిర్మల జయంతి సందర్భంగా ఆమె కాంస్య విగ్రహ ప్రతిష్ట చేశారు. ఈ సందర్భంగా విజయ నిర్మలతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తన ప్రతి సినిమా విడుదల తరువాత తండ్రి కృష్ణ గారు ఫోన్ చేస్తారని, ఆ తరువాత విజయ నిర్మల ఫోన్ చేసి అభినందిస్తారని, సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదల తర్వాత కృష్ణ గారి నుండి ఫోన్ వచ్చిన తరువాత మహేష్ కి మరో ఫోన్ రాకపోవడంతో విజయ నిర్మల లేరన్న విషయం గుర్తుకు వచ్చిందట.
సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మహేష్, తన తదుపరి చిత్రంగా దర్శకుడు వంశీ పైడిపల్లితో చేస్తున్నారు. ఇక మే నెల నుండి మహేష్-వంశీ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా కియారా అద్వానీని తీసుకోవాలని అనుకుంటున్నారని సమాచారం.