మహేష్ ఫ్యాన్స్ అప్పుడే సందడి మొదలుపెట్టేశారు

మహేష్ ఫ్యాన్స్ అప్పుడే సందడి మొదలుపెట్టేశారు

Published on Jun 21, 2020 11:41 AM IST

మహేష్ బర్త్ డేకు దాదాపు రెండు నెలల సమయం ఉండగా అప్పుడే ఫ్యాన్స్ సందడి మొదలుపెట్టేశారు. సోషల్ మీడియా వేదికగా మిగతా ఫ్యాన్స్ రికార్డ్స్ చెరిపివేయాలని ఇప్పటి నుండే సన్నద్ధం అవుతున్నారు. అడ్వాన్స్ బర్త్ డే విషెష్ తో ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పటికే మహేష్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే ట్యాగ్ 4 మిలియన్స్ ట్వీట్స్ కి చేరుకుందట. మరి అడ్వాన్ బర్త్ డే విషెష్ తోనే ఇంత హంగామా చేస్తున్న ఫ్యాన్స్ మరి బర్త్ డే రోజు ఎంత రచ్చ చేయనున్నారో..

ఆగస్టు 9న మహేష్ బర్త్ డే కాగా ఈ ఏడాది 45వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఇక దర్శకుడు పరుశురాం తో సర్కారు వారి పాట అనే మూవీ ప్రకటించిన మహేష్ ఈ ఏడాది చివర్లో ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొననున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి మహేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు