టాలీవుడ్ సినీ ప్రస్థానంలో సూపర్ స్టార్ కృష్ణ గారు ఒకసారికొత్త ఒరవడిని సృష్టించారు. అలా తాను రాణిస్తున్న రోజుల్లోనే ఘట్టమనేని కుటుంబం నుంచి హీరోగా రమేష్ బాబు హీరోగా పరిచయం అయ్యి పలు చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు. అలాగే ఆ సమయంలోనే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీను ఏలుతున్న సూపర్ స్టార్ మహేష్ మహేష్ బాబు బాల నటునిగా ఆయనతో కలిపి కనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అయితే ఈరోజు రమేష్ బాబు పుట్టినరోజు కావడంతో ఘట్టమనేని అభిమానులు అంతా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే మహేష్ కూడా అన్నయ్య పట్ల ప్రేమను వ్యక్తం చేసారు. ఇప్పటి వరకు నేను నేర్చుకున్న దానిలో అన్నయ్య దగ్గర నుంచి నేర్చుకున్నది కూడా కొంత ఉంది. క్రమశిక్షణ, అంకితభావం వంటివి నాకు నిస్వార్ధంగా అందించిన నువ్వు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మహేష్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.
https://www.instagram.com/p/CGR8cWknFUX/?