“సర్కారు వారి పాట”కు మహేష్ బ్రేక్ తీస్కోలేదా.?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ నుంచి ఒక పక్కా మాస్ కమర్షియల్ సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. అదేంటి లాస్ట్ “సరిలేరు నీకెవ్వరు” లో పుష్కలంగా మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా అనుకోవచ్చు. కానీ అందులో మాస్ ఎలిమెంట్స్ తో పాటుగా మంచి సందేశం కూడా ఉంది.

సినిమా మొదలైనప్పటి నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఆన్ మాస్ సినిమా మహేష్ నుంచి వచ్చి చాలా కాలం అయ్యింది. కానీ ఇప్పుడు దర్శకుడు పరశురామ్ తో తీస్తున్న “సర్కారు వారి పాట” తో ఒక పక్కా మాస్ ఎంటర్టైనర్ ను తీసి తన సందేశాత్మక చిత్రాలకు మహేష్ బ్రేక్ ఇస్తారు అని టాక్ వినిపించింది.

కానీ ఇప్పుడు లేటెస్ట్ రూమర్స్ ఏమిటంటే ఈ చిత్రంలో కూడా కావాల్సినన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటుగా సందేశం కూడా ఉండనుంది అని టాక్ వినిపిస్తుంది. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది. ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Exit mobile version