చిరంజీవి సినిమా కోసం మహేష్ బాబు ఆ పని చేస్తున్నారా ?

చిరంజీవి సినిమా కోసం మహేష్ బాబు ఆ పని చేస్తున్నారా ?

Published on Oct 14, 2020 11:05 PM IST


మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ‘ఆచార్య’ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. మెగాస్టార్ సైతం చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ సినిమాను అన్ని విధాలా గొప్పగా ఉండేలా తెరకెక్కిస్తున్నారు కొరటాల. అందులో భాగంగానే సినిమాకు సూపర్ స్టార్ మహేష్ బాబు చేత వాయిస్ ఓవర్ ఇప్పిస్తున్నారని ప్రచారం నడుస్తోంది. మహేష్ బాబుకు మెగాస్టార్ అంటే ప్రత్యేక అభిమానం ఉంది. అలాగే మహేష్ బాబు, కొరటాల శివల రిలేషన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి కాంబినేషన్లో ‘శ్రీమంతుడు, భరత్ అనే నేను’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి.

ఈ సాన్నిహిత్యంతోనే కొరటాల మహేష్ బాబును వాయిస్ ఓవర్ ఇవ్వమని కోరారని, అందుకు మహేష్ సైతం ఓకే చెప్పారని అంటున్నారు. మరి ఈ మాటల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే టీమ్ నుండి అఫీషియల్ క్లారిటీ వచ్చే వరకు ఆగాల్సిందే. మహేష్ గతంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘జల్సా’ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చి సప్రైజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా కూడ కొరటాల గత చిత్రాల తరహాలోనే సోషల్ మెసేజ్, కమర్షియల్ ఎలిమెంట్స్ కలగలిసి ఉంటుందట. ఇందులో కాజల్ అగర్వాల్ కథానాయిక కాగా రామ్ చరణ్ ఒక కీ రోల్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు