హాకింగ్ కి గురైన మహేష్ బాబు ట్విట్టర్

mahesh-Nenokkadine

నిన్న రాత్రి సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి వచ్చిన ట్వీట్స్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. మహేష్ బాబు చాలా కూల్ గా, తన ఎమోషన్స్ ని పబ్లిక్ గా చూపించుకోకుండా కాస్త ప్రైవేట్ గా ఉండే మనిషి. కానీ నిన్న రాత్రి చేసిన ట్వీట్స్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఆయన పోట్ చేసిన ట్వీట్స్ మీ కోసం.. అ ట్వీట్స్ లో మా టీవీ అవార్డ్స్ కి బెస్ట్ యాక్టర్ కేటగిరీలో నామినేషన్స్ గురించి ఉంది.

‘మా టీవీ అవార్డ్స్ బెస్ట్ యాక్టర్ విభాగంలో ‘బిజినెస్ మేన్’ నామినేట్ అవ్వలేదు. ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే నా కెరీర్లో ఇప్పటివరకూ బెస్ట్ పెర్ఫార్మన్స్ గా చెప్పుకుంటాను. బహుశా నేను మరో రెండు నెలలు మన దేశంలో ఉండటం లేదు అందుకే ఎంపిక చేయలేదా? నాకు తెలిసి హాజరు కావడం కచ్చితం అనుకుంటానని’ ట్వీట్ చేసాడు.

కొద్ది సేపటి తర్వాత ఆ ట్వీట్స్ ని డెలీట్ చేసి అకౌంట్ హాక్ అయ్యిందని కొత్త మెసేజ్ పోస్ట్ చేసారు. ‘ ఇప్పుడే నా అకౌంట్ ఎవరో హాక్ చేసారని కాల్స్ వస్తున్నాయి. క్షమించాలి.. ఆ ట్వీట్స్ చేసింది నేను కాదు. పాస్వోర్డ్ మార్చేసాను.. గుడ్ నైట్” అని మహేష్ బాబు ట్వీట్ చేసాడు.

Exit mobile version