కూతురు పుట్టినరోజు వేడుకని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్న సూపర్ స్టార్

Mahesh-Babu-Daughter-Birthday

సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితార ఈ రోజు మొదటి పుట్టినరోజు జరుపుకోనుంది. ఈ పుట్టిన రోజు వేడుకని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి మహేష్ బాబు ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. ప్రస్తుతం మహేష్ బాబు “1-నేనొక్కడినే’ సినిమా షూటింగ్ లో బాగంగా బ్రిటన్ లో ఉన్నాడు. ఈ సినిమా బృందానికి తన కూతురు పుట్టిన రోజు వేడుకలో భాగంగా ఆతిద్యం ఇవ్వనున్నాడని తెలిసింది. మాకు తెలిసిన సమాచారం ప్రకారం మహేష్ బాబు ఈ రోజు షూటింగ్ కు హాజరు కావడం లేదు. గత కొద్ది వారాలుగా మహేష్ బాబు ఈ సినిమా షూటింగ్ డిఫరెంట్ పార్ట్స్ గా యూరోప్ లో జరుగుతోంది. ఈ సినిమా టీం ఆగష్టులో తిరిగి ఇండియాకు వచ్చే అవకాశం వుంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Exit mobile version