ప్రస్తుతం సూపర్ స్టార్ మహిష బాబు నటిస్తున్న సినిమా ‘1-నేనొక్కడినే’. ఈ సినిమాలో మహిష బాబు కొడుకు గౌతంకృష్ణ కూడా కనిపించనున్నాడు. ఈ సినిమాలో గౌతంకృష్ణ యంగ్ మహిష బాబుగా కనిపించనున్నడని సమాచారం. అతనిపై కొన్ని సన్నివేశాలను నిన్న లండన్ లో షూట్ చేయడం జరిగింది. గతంలో సూపర్ స్టార్ కృష్ణ సినిమాలో మహేష్ బాబు కూడా చాలా సినిమాలలో నటించడం జరిగింది. ‘1-నేనొక్కడినే’ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా 14రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు కొత్త అవతారంలో స్టైలిష్ గా కనిపించనున్నాడు.