సూపర్ స్టార్ మహేష్ బాబు కొడుకైన గౌతమ్ త్వరలో రిలీజ్ కానున్న ‘1-నేనొక్కడినే’ సినిమాలో కనిపించనున్నాడు. ఈ యంగ్ బాయ్ ప్రస్తుతం శబ్దాలయా స్టూడియోస్ లో ‘1’ సినిమాకి డబ్బింగ్ చెప్తున్నాడు. గౌతమ్ కి డబ్బింగ్ థియేటర్లో ఇదే మొదటి అనుభవం. అలాగే మొదటి సారైనప్పటికీ గౌతమ్ పర్ఫెక్ట్ గా డబ్బింగ్ చెప్తున్నాడని సమాచారం. ఈ సినిమాలో మహేష్ బాబు చిన్నప్పటి పాత్రలో గౌతమ్ కనిపిస్తాడు.
మేము ఉదయం చెప్పినట్లుగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా ఆడియోని ఈ నెల 19న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ‘1-నేనొక్కడినే’ లో ఫాస్ట్ ఫాస్ట్ గా సాగే యాక్షన్ సీక్వెన్స్ లు మరియు ఫుల్ గ్రిప్ తో ఉండే స్టొరీ లైన్ ఉంటుందని అంటున్నారు. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్నారు.
గుడ్ లక్ గౌతమ్..అలాగే నీ మొదటి డబ్బింగ్ అనుభవం శబ్దాలయా స్టూడియోస్ లో జరుగుతుండడం చాలా ఆనందంగా ఉంది.