నవంబర్ 8నుంచి మహేష్ బాబు గోవా షెడ్యూల్

నవంబర్ 8నుంచి మహేష్ బాబు గోవా షెడ్యూల్

Published on Nov 6, 2013 6:12 PM IST

1Nenokkadine
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘1-నేనొక్కడినే’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2014 జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ డెడ్ లైన్ కి అనుగునంగా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసేలా ఈ చిత్ర ప్రొడక్షన్ టీం ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాని మరో వారం రోజుల పాటు గోవాలో షూట్ చేయనున్నారు. ఈ షెడ్యూల్ నవంబర్ 8నుంచి మొదలు కానుంది.

త్వరలోనే డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో డైరెక్టర్ సుకుమార్ మహేష్ బాబుని సరికొత్త స్టైలిష్ అవతారంలో కనిపించనున్నాడు. కృతి సనన్ మహేష్ బాబు సరసన హీరోయిన్ గా కనిపించనుంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘1-నేనొక్కడినే’ కి ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా స్ట్రాంగ్ గా ఉంది. దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమా ద్వారా మొదటి సారి మహేష్ బాబు మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

తాజా వార్తలు