మహేష్ ‘1’కి వేగంగా జరుగుతున్న విఎఫ్ఎక్స్ వర్క్

One-Nenokkadine
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘1-నేనొక్కడినే’ సినిమా ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఎక్కువ హై వోల్టేజ్ తో కూడుకున్న యాక్షన్ సీక్వెన్స్ లు ఉండనున్నాయి. ఈ విఎఫ్ఎక్స్ కోసం ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాకి సంబందించిన కొన్ని విఎఫ్ఎక్స్ పనులు హైదరాబాద్లో జరుగుతున్నాయి. ఆ వర్క్ కూడా శరవేగంగా జరుగుతోంది.

ఈ చిత్ర ప్రొడక్షన్ టీం చెప్పిన సమాచారం ప్రకారం సినిమాని అనుకున్న టైంకి రిలీజ్ చెయ్యాలనే ఉద్దేశంతో టెక్నీషియన్స్ అందరూ ఎక్కువ టైం పనిచేస్తున్నారు. మహేష్ బాబు – కృతి సనన్ జంటగా నటించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకి సుకుమార్ డైరెక్టర్. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ ఆడియో ఆల్బం ఈ నెల 19న విడుదల కానుంది. 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ వారు నిర్మించిన ఈ భారే బడ్జెట్ మూవీ రైట్స్ ని ఈరోస్ ఇంటర్నేషనల్ వారు దక్కించుకున్నారు.

Exit mobile version