సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘1-నేనొక్కడినే’ సినిమా సెన్సార్ కార్యక్రమాలకు రెడీ అయ్యింది. ఈ సినిమా టీం సెన్సార్ కార్యక్రమాలకు కావలసిన ఏర్పాట్లు చేసింది. అన్ని సవ్యంగా సాగితే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు ఈ రోజు (జనవరి 3న) ముగుస్తాయి. దాని అధికారిక ప్రకటన కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాని జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. ఈ సినిమా రైట్స్ ని ఎరోస్ ఇంటర్నేషనల్ సొంతం చేసుకుంది. ఈ సినిమాని విదేశాలలో కూడా భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. ఈ సినిమాని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో మహేష్ బాబు సరసన కృతి సనన్ నటిస్తోంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాకు సంబందించిన సెన్సార్ కార్యక్రమాల వివరాలను త్వరలోనే తెలియజేస్తాం.