సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘1-నేనొక్కడినే’ సినిమా భారీ ఓపెనింగ్స్ తో జనవరి 10న రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి క్రేజ్ ఎంత ఎక్కువగా ఉందో, అంచనాలు కూడా అంతే ఎక్కువగా ఉన్నాయి. దానికి తోడు ఈ సంవత్సరం బాక్స్ ఆఫీసు వద్ద రిలీజ్ అవుతున్న మొదటి పెద్ద హీరో సినిమా కావడం, అదీ సంక్రాంతి సీజన్ కావడంతో అన్ని రకాలుగా ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వస్తాయని ఆశిస్తున్నారు.
మహేష్ బాబు – కృతి సనన్ జనటగా నటించిన ఈ స్టైలిష్ ఎంటర్టైనర్ కి సుకుమార్ దర్శకత్వం వహించగా, దేవీశ్రీ ఒరసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించిన ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని ఈరోస్ ఇంటర్నేషనల్ వారు సొంతం చేసుకున్నారు.