సెన్సార్ పూర్తి చేసుకున్న ‘1-నేనొక్కడినే’

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘1-నేనొక్కడినే’

Published on Jan 6, 2014 3:41 PM IST

1_Nenokkadine

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘1-నేనొక్కడినే’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సినిమా ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ వారు ఈ సినిమాకి ‘యు/ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. మాకు అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా నిడివి 2 గంటల 30 నిమిషాలు. సెన్సార్ పూర్తవడంతో సినిమా 10న రిలీజ్ కి సిద్దమైందని చెప్పవచ్చు.

సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యడానికి వస్తున్న 1 సినిమాకి సుకుమార్ డైరెక్టర్. మహేష్ బాబు రాక్ స్టార్ గా స్టైలిష్ లుక్ లో కనిపించనున్న ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా కనిపించనుంది. లండన్, బ్యాంకాక్ లలో ఎక్కువ భాగం షూట్ చేసిన ఈ సినిమా కోసం ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ చాలా మంది పనిచేసారు.

ఈరోస్ ఇంటర్నేషనల్ వారు ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు.

తాజా వార్తలు