డిసెంబర్ లో మహేష్ బాబు ‘1’ ఆడియో

1Nenokkadine
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘1-నేనొక్కడినే’ సినిమా ఆడియోని డిసెంబర్ లో రిలీజ్ చేయనున్నారు. యంగ్ తరంగ్ దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. దేవీశ్రీ ఈ మూవీ కోసం కొన్ని డిఫరెంట్ ట్యూన్స్ కంపోజ్ చేసాడని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బ్యాంకాక్ లో జరుగుతోంది. ఈ బ్యాంకాక్ షెడ్యూల్ ఈ నెల 17వరకు జరగనుంది.

బ్యాంకాక్ షెడ్యూల్ తర్వాత మరో తాజా షెడ్యూల్ ఈ నెలాఖరు నుంచి బెంగుళూరు లో మొదలు కానుంది. ఆ షెడ్యూల్ తో టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుంది. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. మంచి యాక్షన్ ఎపిసోడ్స్ ఉండే ఈ సినిమా స్టైలిష్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాతో కృతి సనన్ హీరోయిన్ గా తెలుగు వారికి పరిచయం కానుంది.

Exit mobile version