మర్డ్ కోసం వాయిస్ ఇవ్వనున్న మహేష్ బాబు

మర్డ్ కోసం వాయిస్ ఇవ్వనున్న మహేష్ బాబు

Published on May 6, 2013 11:30 AM IST

mahesh-babu

సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక గొప్ప కారణం కోసం వాయిస్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. బాలీవుడ్ యాక్టర్, డైరెక్టర్ అయిన ఫరాన్ అక్తర్ స్థాపించిన సోషల్ అవేర్ నెస్ సంస్థ మర్డ్(MARD ) గురించి మాట్లాడడం కోసం మహేష్ బాబు ఓకే చెప్పారు. మర్డ్ అంటే ‘మెన్ ఎగైనెస్ట్ రేప్ అండ్ డిస్క్రిమినేషన్’.

బాలీవుడ్ ఫేమస్ పాటల రచయిత జావేద్ అక్తర్ ఈ సంస్థ కోసం ఓ కవితని రాశారు. దాన్ని తెలుగులోకి కూడా అనువదించారు. తెలుగు వెర్షన్ లో ఈ కవితకి మహేష్ బాబు వాయిస్ ఇవ్వనున్నాడు. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజలందరికీ చేరేలా చేయ్యగలవారు ఎవరా అని వెతికిన ఈ సంస్థ మహేష్ బాబుని ఎంచుకున్నారు.

‘లింగ అనమానత’, దేశంలో మహిళలు ఎదుర్కొంటున్న అన్యాయాల్ని గురించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే మర్డ్ మొక్క లక్ష్యం.

తాజా వార్తలు