సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘1- నేనొక్కడినే’ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా లండన్ లో జరుగుతోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ బెల్ ఫాస్ట్, నార్తెర్న్ ఐర్లాండ్ లలో జరిగింది. ప్రస్తుతం మహేష్ బాబు లండన్ లో షూట్ చేస్తున్న షెడ్యూల్ ఆగష్టు 20వరకు జరగనుంది. ప్రస్తుతం కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లను, చేజింగ్ సీక్వెన్స్ లను మహేష్ బాబుపై షూట్ చేస్తున్నారు, అలాగే మరికొంతమంది ముఖ్యమైన నటులు కూడా షూటింగ్ లో పాల్గొంటున్నారు. మహేష్ బాబు కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి సుకుమార్ డైరెక్టర్.
అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ కలిసి 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ‘బోర్న్ ఐడెంటిటీ’ సీరీస్ లా ఉండే ఈ సినిమాలో సూపర్బ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని సమాచారం. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాకి రత్నవేలు సినిమాటోగ్రాఫర్. ఈ సినిమా 2014 జనవరిలో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.