‘రుద్రమదేవి’ సినిమాలో మహేష్ బాబు ?

Mahesh-Babu-to-shoot-for-Ru

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫాన్స్ ఆయనని త్వరలో ఒక కొత్త అవతారంలో చూడనున్నారు. మేము విన్న సమాచారం ప్రకారం మహేష్ బాబు పీరియడ్ డ్రామా గా తెరకెక్కుతున్న ‘రుద్రమదేవి’ సినిమాలో ఒక గెస్ట్ రోల్ లో కనిపించానున్నాడు. ఈ సినిమాలో ఆయన గోన గన్న రెడ్డి గా కనిపించనున్నాడని సమాచారం. మహేష్ బాబు పాత్రకు సంబందించిన షూటింగ్ కార్యక్రమాలను డిసెంబర్ లో చిత్రీకరించే అవకాశం వుందని తెలిసింది. అయితే ఈ విషయాన్ని ఇప్పటివరకు నిర్వాహకులు అధికారికంగా తెలియజేయలేదు. ఈ సినిమాకి గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో ఆయన మహేష్ బాబు తో ‘ఒక్కడు’, ‘అర్జున్’, ‘సైనికుడు’, లాంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. పీరియడ్ డ్రామా తెరకెక్కుతున్న ఈ సినిమాని గుణ శేఖర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. అనుష్క ఈ సినిమా రుద్రమదేవిగా కనిపించనుంది. రానా దగ్గుపాటి రాకుమరుడిగా నటిస్తున్నాడు. రెబల్ స్టార్ కృష్ణంరాజు, బాబా సెహగల్ మొదలగు వారు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నాడు.

Exit mobile version