సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రానున్నసినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ నెల 18 నుండి హైదరాబాద్లో మొదలు కానుంది. మహేష్ బాబు 25 రోజులు టాకీ పార్ట్ షూటింగ్లో పాల్గొననున్నారు. త్వరలోనే ఈ సినిమా లండన్ లో కూడా షూటింగ్ జరుపుకోనుంది. కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాకి ఇంకా పేరును ఖరారు చేయలేదు. 14రీల్స్ ఎంటర్తైన్మెంట్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా ఈ సంవత్సరం సెకండాఫ్ లో విడుదలయ్యే అవకాశం ఉంది. మహేష్ బాబు ఇదే బ్యానర్ పై మరో సినిమాకి కూడా సంతకం చేశాడు. ఈ సినిమాకి శ్రీను వైట్ల దర్శకత్వం వహించవచ్చు.