సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే థమ్సప్, నవరత్న ఆయిల్, యూనివర్సల్, అమృతాంజన్, ప్రోవోగ్, ఐడియా సెల్యులార్, వివేల్, జోస్ అలుక్కాస్, సంతూర్ మరియు మహీంద్రా వంటి చాలా బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్నారు. అయన బ్రాండ్ అంబాసిడర్ ఖాతాలో మరో కంపెనీ చేరింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మహేష్ బాబు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కి కూడా బ్రాండ్ అంబాసిడర్ గా చేయనున్నారు. మూడు సంవత్సరాలు సౌత్ ఇండియా షాపింగ్ బ్రాండ్ అంబాసిడర్ గా చేయడానికి ఒప్పందం జరిగినట్లు సమాచారం. ఈ రోజు పార్క్ హయ్యత్ హోటల్లో జరిగే కార్యక్రమానికి మహేష్ హాజరవుతారని సమాచారం.