ఈ రోజు నుండి మహేష్ బాబు డబ్బింగ్

ఈ రోజు నుండి మహేష్ బాబు డబ్బింగ్

Published on Dec 10, 2012 5:25 PM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ ప్రెస్టీజియస్ సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. పూణేలో మహేష్, సమంత మీద ఒక పాట చిత్రీకరణ కోసం వెళ్ళిన చిత్ర బృందం నిన్న తిరిగి వచ్చింది. ఈ రోజు మహేష్ బాబుకి సంభందించిన డబ్బింగ్ ప్రారంభం కానుంది. వెంకటేష్ డబ్బింగ్ ఇప్పటికే దాదాపు పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ శరవేగంగా పూర్తి చేసి సంక్రాంతి వరకు సినిమాని ఎలాగైనా విడుదల చేయాలని టీం అంతా కష్ట పడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాదులో కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. జనవరి మొదటి వారంలో వెంకటేష్ మీద ఒక పాట చిత్రీకరిస్తారని సమాచారం. ఆడియోని 15న విడుదల చేసి జనవరి 11న సినిమాని విడుదల చేయబోతున్నారు.

తాజా వార్తలు