సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా రోజుల తర్వాత ఈ రోజు ట్విట్టర్ లో సందడి చేసాడు. ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న సూపర్ స్టార్ కృష్ణ గారికి విష్ చేసారు, అలాగే తన రాబోయే సినిమా ‘1-నేనొక్కడినే’ సినిమా టీజర్ కి వస్తున్న రెస్పాన్స్ చూసి ఎంతో సంతోషానికి లోనై తన ఫ్యాన్స్ కి థాంక్స్ చెప్పారు.
” మా సినిమా ‘1’ ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ టీజర్ కి వస్తున్న రెస్పాన్స్ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. మీ అంచనాలను అందుకోవడానికి మొత్తం టీం చాలా కష్టపడుతున్నాం. నా కెరీర్లో మరో ల్యాండ్ మార్క్ గా ఈ సినిమా నిలుస్తుంది. ఎప్పుడు నాపై ఇంత అభిమానాన్ని, నాకు సపోర్ట్ ఇస్తున్నందుకు చాలా థాంక్స్ అని” ట్వీట్ చేసాడు.
‘1-నేనొక్కడినే’ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉంటుందని అందరూ భావిస్తున్నారు. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. యంగ్ తరంగ్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఫస్ట్ టీజర్, పోస్టర్స్ వల్ల ఈ సినిమా టైటిల్ పై ఇన్ని రోజులు ఉన్న సస్పెన్స్ వీడిపోయింది.