సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేయబోతున్నారని తాజా సమాచారం. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ఈ నెల 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ విషయంపై అధికారిక ప్రకటన కోసం అబిమనులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా టైటిల్ ను ఖరారు చేయలేదు. ఈ సినిమా టైటిల్ గ్రాండ్ గా, స్టైల్ గా ఉండాలని సినిమా నిర్వాహకులు బావిస్తున్నారని సమాచారం. మహేష్ బాబు ‘దూకుడు’ సినిమా నిర్మించిన 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ఈ సినిమాని నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.