13నుండి తిరిగి ప్రారంభంకానున్న మహేష్ బాబు- సుకుమార్ సినిమా

Mahesh---Sukumar
డైరెక్టర్ సుకుమార్ సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కొత్త షెడ్యూల్ ఈ నెల 13నుండి మొదలుకానుంది. మహేష్ ఫ్యామిలీతో విహారయాత్రకు వెళ్లి ఇటీవలే తిరిగివచ్చాడు. ఈ సినిమా 2013 చివరి నెలలలో విడుదల కావచ్చు. జూన్ లో బృందమంతా విదేశాలకు వెళ్లి అక్కడ కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.

ఈ సినిమాలో మహేష్ బాబుని చాలా స్టైలిష్ గా చూపించనున్నారు. తన దేహధారుడ్యం కోసం మహేష్ చాలా కసరత్తులు చేసాడు. ఒకరకంగా ఫాన్స్ కు ఈ సినిమా ఒక విందుభోజనంలాంటిది. ఈ సినిమా 14రీల్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.
ఈ సినిమా ద్వారా కృతి సనన్ హీరొయిన్ గా పరిచయం కానుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు

Exit mobile version