పెళ్లి సీన్స్ లో నటిస్తున్న మహేష్ బాబు

పెళ్లి సీన్స్ లో నటిస్తున్న మహేష్ బాబు

Published on Sep 5, 2012 11:18 AM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. ప్రస్తుతం ఈ చిత్ర చిత్రీకరణ చెన్నైలోని శ్రీ పెరుంబుదూర్ లో జరుగుతోంది. నిన్న ప్రారంభమైన ఈ చిత్రీకరణలో మహేష్ బాబు పై పెళ్ళికి సంభందించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రీకరణలో విక్టరీ వెంకటేష్, సమంత మరియు ఇతర తారాగణం పాల్గొంటున్నారు.

దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శ్రీ కాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ చిత్ర టాకీ పార్ట్ చివరి దశకు చేరుకోగా, ఈ చిత్రంలోని పాటల చిత్రీకరణ మిగిలి ఉంది.

వెంకటేష్ – మహేష్ బాబు అన్నదమ్ములుగా కనిపిస్తున్న ఈ చిత్రంలో వీరికి తల్లితండ్రుల పాత్రల్లో ప్రకాష్ రాజ్ మరియు జయసుధ కనిపించనున్నారు.

తాజా వార్తలు