వెస్ట్ ఇన్ లో షూటింగ్ జరుపుకుంటున్న మహేష్ బాబు

Mahesh
సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న మహేష్ బాబు కొంత విరామం తర్వాత ఈ సినిమా షూటింగ్ లో తిరిగి పాల్గుంటున్నాడు. ఈరోజు ఉదయం హైదరాబాద్లో వెస్ట్ ఇన్ హోటల్ లో మహేష్ మెరిసాడు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ విదేశాలలో జరగనుంది. సైకలాజికల్ డ్రామా తరహాలో సాగే ఈ సినిమాలో మనం ఇప్పటివరకూ చూడని మహేష్ ని చుస్తామట. కృతి సనన్ హీరొయిన్ గా తెలుగు తెరకు పరిచయం కానుంది. గోపిచంద్, రామ్ ఆచంట, అనీల్ సుంకర ఈ సినిమాను 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version