పవన్ ఫ్యాన్స్ కు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన మహేష్.!

మన టాలీవుడ్ లోని స్టార్ హీరోలు మరియు వారి అభిమానుల నడుమ ఎలాంటి సంబంధ బాంధవ్యాలు ఉంటాయో అందరికీ తెలిసిందే. ఒక హీరో కోసం మరో హీరో ఏదన్నా చిన్న మాట చెప్తేనే ఎంతో పొంగిపోతారు మనవారు. అందులోనూ ఒకేలాంటి స్టార్డం ఉన్న హీరోలు తమ సహా హీరోల కోసం మాట్లాడితే వారి అభిమానులకు ఎంత బాగుంటుంది.

ఇపుడు అలాంటి చెప్పలేని ఫీలింగ్ లోనే పవర్ స్టార్ అభిమానులు ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబులు ఇద్దరూ ఇద్దరే.. ఏ అంశంలో అయినా సరే వీరి మధ్య కానీ వీరి అభిమానుల మధ్యలో కానీ చాలా గట్టి పోటీ ఉంటుంది.. అది ఫ్రెండ్లీగా కొనసాగడం ఇపుడు మరింత ఆనందదాయకం అని చెప్పాలి.

ఈరోజు పవన్ పుట్టినరోజు పునస్కరించుకొని మహేష్ ఊహించని విధంగా చేసిన ట్వీట్ ఇద్దరు హీరోల అభిమానులకు ఎంతో ఆనందాన్ని నింపింది. పవన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పవన్ దయ, వినయాలు మార్పుకు సంకేతం ఇస్తాయని, పవన్ ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ట్వీట్ చేసారు. మరి దీనికి పవన్ కూడా రిప్లై ఇస్తే వీరి ఆనందం ఖచ్చితంగా మరింత రెట్టింపు అవుతుంది.

Exit mobile version