చిన్నపిల్లల కోసం ట్రస్ట్ ఏర్పాటు చేయనున్న మహేష్ బాబు

Mahesh-Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు నిన్న విజయవాడ రెయిన్ బో హాస్పిటల్ ను ప్రారంభించారు. ఈ ఈవెంట్ లో ఆయన కాసేపు విలేకరులతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ఒక చారిటీ పెట్టడానికి తను ప్లాన్ చేస్తున్నట్లు చెప్పడం జరిగింది. ‘నేను త్వరలో ఒక ట్రస్ట్ ని పెట్టాలనుకుంటున్నాను. దాని ద్వారా పేదవారైన చిన్న పిల్లలకు సహాయాన్ని అందించాలనుకుంటున్నాను . ఈ ట్రస్ట్ పేద పిల్లలకు వచ్చే కాన్సర్, హార్ట్ సమస్యలు, లివర్ మార్పిడి వంటి వాటిని ట్రిట్ మెంట్ ఇచ్చేవిదంగా ఉటుంది. ఈ ట్రస్ట్ ని రెయిన్ బో వారితో కలిసి ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. మూడు నెలలో దీనికి సంబందించిన వివరాలు తెలియజేస్తానని’ అన్నాడు.

మహేష్ బాబు చాలా మంచి పని చేయాలనుకుంటున్నాడు. దీనితో అందరి మనసును గెలుచుకోనున్నాడు ఈ సూపర్ స్టార్. మన తెలుగులో పెద్ద హీరోలు అందరు ఏదో ఒక రకంగా ప్రజలకు సహాయం అందిస్తున్నారు. వారి లిస్టులో ఇప్పుడు మహేష్ బాబు కూడా చేరనున్నాడు.

Exit mobile version