SSMB29: నో డూప్స్.. ఎలాంటి రిస్కైనా మహేష్ డేరింగ్ అండ్ డాషింగ్!?

ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర ఇంకా ఎలాంటి అధికారిక అనౌన్సమెంట్ కూడా లేకుండా ఊహించని లెవెల్ అది కూడా గ్లోబల్ లెవెల్ హైప్ ఉన్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ సినిమానే అని చెప్పవచ్చు. అయితే మహేష్ బాబు నుంచి ఒక స్పెషల్ క్వాలిటీ తన కెరీర్ ఆరంభం నుంచే ఉంది.

ఇప్పుడు అదే మళ్ళీ ఈ భారీ ప్రాజెక్ట్ కోసం బయట పెట్టనున్నట్టుగా తెలుస్తుంది. మహేష్ బాబు తన కెరీర్ స్టార్టింగ్ లోనే టక్కరి దొంగ, ఒక్కడు, 1 నేనొక్కడినే ఇంకా పలు సినిమాల్లో చాలా రిస్క్ తో కూడుకున్న స్టంట్స్ చేసేసారు. ఇప్పుడు అంటే ఆ తరహా సినిమాలు తనకి పడట్లేదు కానీ రిస్క్ పరంగా మహేష్ కథ డిమాండ్ చేస్తే ఎంత దూరమైనా వెళ్లడం మహేష్ నైజం.

ఇప్పుడు ఇదే డేరింగ్ అండ్ డాషిండ్ ‘దూకుడు’తో జక్కన్న కోసం ప్రాణం పెట్టి మరీ వర్క్ చేస్తున్నారట. ఈ సినిమాలో మేజర్ గా అసలు డూప్ కి నో చెప్పేస్తున్నారట. ఎలాంటి రిస్క్ అయినా కూడా మహేష్ బాబే చేయాలని ఫిక్స్ అయ్యినట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా కోసం మహేష్ బాబు తన బెస్ట్ ఇవ్వాలనే చూస్తున్నారట. సో ఈ బిగ్ ప్రాజెక్ట్ లో మాత్రం మహేష్ బాబు నుంచి ఊహించని స్టంట్స్ మనం ఆశించవచ్చు.

Exit mobile version