సూపర్ మహేష్ బాబు నటించిన ‘1 నేనొక్కడినే’ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించినంత విజయం సాధించలేకపోయింది. అమెరికా మినహా మిగిలిన ఏ ఏరియాలలో కుడా కమర్షియల్ గా విజయాన్ని అందుకోలేదు. మహేష్ బాబు ఈ సినిమాలో కనబరిచిన నటనకు ప్రశంసల వర్షం కురిసినా కాసుల వర్షం మాత్రం కురవలేదు
ఇప్పుడు మన సూపర్ స్టార్ ఆగడు ద్వారా మనముందుకు రానున్నాడు. ఆద్యంతం ఎంటర్టైన్మెంట్ తో సాగీ ఈ సినిమాలో మహేష్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. శ్రీనువైట్ల దర్శకుడు. తమన్నా హీరొయిన్.
బాక్స్ ఆఫీస్ దగ్గర కాసులు కురిపించడమే ఈ సినిమా ప్రధానాంశం గా తెరకెక్కుతున్నట్లు సమాచారం. 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మాత. థమన్ సంగీత దర్శకుడు. ఈ ఏడాదిలో ఈ చిత్రం మనముందుకు రానుంది