మ‌హేష్ గ్యాప్ ఇచ్చి రాజమౌళి సినిమా చేస్తాడేమో ?

మ‌హేష్ గ్యాప్ ఇచ్చి రాజమౌళి సినిమా చేస్తాడేమో ?

Published on Apr 29, 2020 8:57 PM IST


ఆర్ ఆర్ ఆర్ సినిమా త‌ర్వాత రాజమౌళి త‌న నెక్ట్స్ మూవీ మహేష్ బాబు చేస్తున్నట్టు ఇప్ప‌టికే ప్ర‌క‌టించేశారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో క్లారిటీ లేదు. ప్రసుతం మహేష్ పరుశురామ్ సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత రాజమౌళి సినిమానా లేక వంశీ పైడిపల్లితో సినిమా చేస్తాడా… మరి మ‌హేష్ ఎవ‌రితో సినిమా చేస్తాడ‌నేది ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ ఇవ్వ‌లేదు.

ఇక కొద్ది రోజులు వంశీ పైడిప‌ల్లి అన్నారు.. వంశీ పైడిప‌ల్లి ఇంకా స్క్రిప్ట్‌ని చెక్క పనిలోనే ఉన్నాడు. మ‌రోవైపు పరశురామ్ మాత్రం బౌండెడ్ స్క్రిప్ట్‌తో రెడీగా ఉన్నాడ‌ని తెలుస్తుంది. అయితే ఈలోపు క‌రోనా వ‌చ్చి లాక్‌డౌన్ కారంణంగా సినీ పరిశ్ర‌మ మొత్తం ష‌ట్‌డౌన్ అయ్యింది. ఎక్క‌డి సినిమాలు అక్క‌డే ఆగిపోయాయి.

దీంతో ఎలాగూ గ్యాప్ వ‌చ్చింది క‌నుక మ‌రి మహేష్ కొన్ని రోజులు వెయిట్ చేసి, పరుశురామ్ తో సినిమా తరువాత రాజ‌మౌళితో సినిమాను స్టార్ట్ చేస్తాడో లేక ఇంకేదైనా ప్రాజెక్ట్ ఓకే చేస్తాడో చూడాలి. ఏది ఏమైనా మ‌హేష్ నుండి క్లారిటీ కావాల‌ని ఆయ‌న ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

తాజా వార్తలు