హాలిడే టూర్ వెళ్ళిన మహేష్

హాలిడే టూర్ వెళ్ళిన మహేష్

Published on Jan 2, 2013 12:00 PM IST

Mahesh-Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్ర షూటింగ్ బిజీ బిజీగా గడిపిన మహేష్ బాబు సరదాగా హాలిడే వెకేషన్ కి వెళ్ళాడు. మహేష్ ప్రతి సినిమా షూటింగ్ పూర్తవగానే హాలిడే టూర్ వెళ్ళడం అలవాటు. ఈ సారి కూడా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు షూటింగ్, డబ్బింగ్ పూర్తి చేసి దుబాయ్ వెళ్ళాడు. మహేష్ కుటుంబ సమేతంగా ఈ టూర్ వెళ్ళాడు. జనవరి 9న మళ్లీ అక్కడి నుండి తిరిగి రానున్నాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కాబోతుంది. ఈ చిత్రం తరువాత మహేష్, సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా రెగ్యులర్ షూటింగ్లో పాల్గొంటాడు.

తాజా వార్తలు