తమిళ సినిమా ఇండస్ట్రి సమాచారం ప్రకారం మణిరత్నం, మహేష్ బాబు ల కళాయికలో ఒక భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ రూపుదిద్దుకోనుంది. ఇదివరకే వీరిరువురూ ‘పోన్నియన్ సెల్వన్’ ఆధారంగా ఒక సినిమాను తీద్దాం అనుకున్నారు. కానీ కొన్ని అవాంతరాల వలన ఈ ప్రొజెక్ట్ ఆగిపోయింది.
ఇప్పుడు వీరిద్ధరూ చర్చలు జరుపుకుంటున్నట్లు సమాచారం. ఇంకా ఎటువంటి విషయమూ అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం మహేష్ ఆగడు తో బిజీగావున్నాడు. దీని తరువాత కొరటాల శివ దర్శకత్వంలో యు.టి.వి పిక్చర్స్ బ్యానర్ పై ఒక సినిమా వుంటుంది. దాని తరువాత సినిమా ఏంటనేది ఆసక్తికరం. బహుశా అది మణిరత్నం సినిమానే కావచ్చు
మహేష్ నటించిన ‘1 నేనొక్కడినే’ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సుకుమార్ దర్శకుడు. 14రీల్స్ ఎంటెర్తైంమెంట్స్ సంస్థ నిర్మాత