మహేష్ బాబు మరోసారి తనకు ఇప్పట్లో హిందీ సినిమాలు చేసే ఆలోచనలేదని స్పష్టం చేసాడు. “మరో పది సంవత్సరాల వరకూ తెలుగు సినిమా తప్ప మరో సినిమా చెయ్యదలుచుకోలేదు”అని విజయవాడలో మీడియా ముందు తెలిపాడు. ఇటీవలే మహేష్ రాజ్ & డి.కె దర్శకత్వంలో ఒక హిందీ సినిమాలో నటిస్తున్నాడని పుకార్లు వచ్చాయి. ఇప్పుడు వాటిని స్వయంగా మహేష్ బాబే ఖండించాడు. ఈ మధ్యే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పూరి తన తదుపరి సినిమా మహేష్ తో ఉంటుందని తెలిపాడు. ఇవన్నీ పరిగణంలోకి తీసుకుంటే మహేష్ ఇప్పట్లో హిందీ సినిమా చేయ్యలేడు అనే చెప్పుకోవాలి. ప్రస్తుతం మహేష్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘1’ సినిమాలో బిజీగా వున్నాడు. దీనికి ‘నేనొక్కడినే’ అనేది ట్యాగ్ లైన్. గోపిచంద్, అనీల్ సుంకర, రామ్ ఆచంట ఈ సినిమాను 14 రీల్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. రత్నవేలు సినిమాటోగ్రాఫర్