మహేష్ బాబు తాజా చిత్రం 1-నేనొక్కడినే పూర్తి కావొస్తుంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ స్టైలిష్ ఆక్షన్ థ్రిల్లర్ 2014 లో విడుదల అవుతున్న చిత్రాల్లో ఎంతో ఎదురుచూస్తున్న చిత్రం. ఈ సినిమాకు ఇంత క్రేజ్ రావడానికి మహేశ్ బాబు కొత్త లుక్ ఏ కాక పలుకారణాలు కూడా వున్నాయి.
ఈ సినిమాలో చివారిపాటను ముంబైలో సోఫియా చౌదరి అనే బాలీవుడ్ నటి సరసన మహేష్ తో చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ డిసెంబర్ 12 నుండి 15 వరకు కొనసాగనుంది. ఈ జోడీ ఇటీవలే లండన్ లో షూటింగ్ ముగించుకుంది. ప్రస్తుతం మహేష్ ముంబైలో ఒక ప్రచారచిత్రంలో నటిస్తున్నాడు
ఈ సినిమాలో మహేష్ రాక్ స్టార్ పాత్రను పోషిస్తున్నాడు. కృతి సనన్ హీరోయిన్. డిసెంబర్ 19న దేవి అందించిన ఆడియో విడుదలకానుంది. ఈ సినిమా 14రీల్స్ సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రా హక్కులను భారీ ధరకు ఈరోస్ సంస్థ దక్కించుకుంది. జనవరి 10న ఈ సినిమా మనముందుకు రానుంది